ఏపీలోని అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై జరిగిన దాడిని మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో చేసినవి ఇప్పుడూ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. ఎంపీపీకి మాత్రమే ఛాంబర్ తాళాలు ఇస్తామని ఎంపీడీవో చెప్పడంతో సుదర్శన్‌రెడ్డి తన 20 మంది అనుచరులతో కలిసి కాళ్లతో తన్నుతూ పిడిగుద్దులు గుద్ది ఆయనపై దాడి చేసిన సంగతి తెలిసిందే.