మైనర్ బాలికపై మేనమామ అత్యాచారం
AP: తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలంలో దారుణం జరిగింది. నిడదవోలు మండలంలోని ఓ హాస్టల్లో బాలిక 9వ తరగతి చదువుతోంది. ఆమె తల్లి ఉద్యోగం నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లగా... తండ్రి వేరుగా ఉంటున్నారు. అమ్మమ్మ దగ్గరే బాలిక ఉంటుంది. ఆధార్ కార్డులో మార్పులు చేయాల్సి ఉండటంతో.. బాలికను తీసుకురమ్మని వరుసకు మేనమామ అయ్యే కమల్‌కు అమ్మమ్మ చెప్పింది. దాంతో కమల్ బాలికను హాస్టల్ నుంచి బైక్‌పై అతని అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.