AP: ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన పోతిన మహేశ్ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ సీటును బీజేపీకి ఇవ్వడంతో ఆయన జనసేనను వీడి వైసీపీలో చేశారు. అయితే పోతిన మహేశ్‌ను కాదని విజయవాడ పశ్చిమ ఇన్‌ఛార్జ్‌గా వైసీపీ అధిష్టానం వెల్లంపల్లి శ్రీనివాస్‌ను నియమించింది. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. పార్టీలో గుర్తింపు లేదని, అందుకే వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం.