AP: ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పుల కోసం ప్రభుత్వ వైద్యులు జారీ చేసే ధ్రువీకరణ పత్రాలనూ అనుమతించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులు ఇచ్చే సర్టిఫికెట్ల మాదిరే ప్రభుత్వ ఆస్పత్రులు ఇచ్చే క్యూఆర్ కోడ్ పత్రాన్ని పరిగణలోకి తీసుకోవాలని తెలిపింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అన్ని జిల్లాల సిబ్బందికి సూచించింది.