కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ అవినాష్ రెడ్డి పిఎ రాఘవరెడ్డి నీ పులివెందుల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పులివెందులలోని రాఘవరెడ్డి నివాసంలో మంగళవారం మధ్యాహ్నం పులివెందుల పోలీసులు ఆయనను విచారణకు తీసుకుని వెళ్లారు. ఇప్పటికే పలు దఫాలుగా రాఘవరెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. తాజాగా ఇంటి వద్దకే వచ్చి పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అరెస్ట్ అనుమానాలకు దారితీస్తుంది.