న్యాయవాది సమక్షంలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ రవీందర్ రెడ్డిని విచారించేందుకు న్యాయస్థానం ఆదేశించిందని బుధవారం వర్రా రవీందర్ రెడ్డి తరఫు న్యాయవాది ఓబుల్ రెడ్డి తెలిపారు. కడప సైబర్ క్రైమ్ స్టేషన్ వద్ద ఆయన మాట్లాడారు. రెండు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతిస్తూ.. కడప సెంట్రల్ జైలు నుంచి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలున్నాయని వివరించారు.