టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ దూకుడు (వీడియో)
టీడీపీ కేంద్ర కార్యాలయం కేసును టేకోవర్ చేసుకున్న సీఐడీ.. కేసు విచారణలో దూకుడు పెంచింది. ఈ మేరకు ప్రధాన నిందితుడు వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగండి చైతన్యను కస్టడీకి ఇవ్వాలని మంగళగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పరారీలో ఉన్న చైతన్య మంగళగిరి కోర్టులో లొంగిపోయారు.