బన్నీ అరెస్ట్.. రచయిత చిన్ని కృష్ణ సంచలన వ్యాఖ్యలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడంపై రచయిత చిన్ని కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్‌కు మరక అంటించాలని చుసిన ఏ నాయకుడైనా.. ఏ ప్రభుత్వం అయినా సర్వనాశనం అయిపోతారని శపించారు. అల్లు అర్జున్ అంటే తనకు ప్రాణమని అన్నారు. బన్నీని అరెస్ట్ చేయడం అత్యంత దారుణమని మండిపడ్డారు. అరెస్ట్ వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. అల్లు అర్జున్ వెనుక పెద్ద కుటుంబం ఉందన్నారు. మెగా ఫ్యామిలీ అంటేనే మానవత్వానికి చిరునామా అన్నారు.