తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్‌-2 పరీక్షలు

57చూసినవారు
తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్‌-2 పరీక్షలు
తెలంగాణలో 783 గ్రూప్‌-2 సర్వీసుల పోస్టుల భర్తీకి ఈనెల 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. ఓఎంఆర్‌ పద్ధతిలో పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 1,368 కేంద్రాలను సిద్ధం చేసింది. ఈ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2022 డిసెంబరు 29న ప్రకటన జారీ చేయగా 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణకు గతంలో పలుమార్లు ఏర్పాట్లు చేసినా వివిధ సాంకేతిక కారణాలతో వాయిదా పడ్డాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్