హాస్టల్ వార్డెన్ వేధింపులు.. ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యాయత్నం (వీడియో)
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఇద్దరు విద్యార్థులు మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సత్తెనపల్లి వెంకటపతి కాలనీలోని హాస్టల్లో వార్డెన్ వేధింపుల వల్లనే విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. భోజనం బాగోలేదని కంప్లైంట్ ఇచ్చినందుకు వార్డెన్ టార్చర్ పెడుతున్నారన్నారు. వార్డెన్ తీరుపై రెండు రోజుల క్రితం విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.