AP: సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన చాలా మంది ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం వీరిని పోలీసు కేసుల భయం వెంటాడుతోంది. తాజాగా నటి శ్రీరెడ్డిపై మరో కేసు నమోదైంది. గుంటూరు మాజీ కార్పోరేటర్ దాసరి జ్యోతి ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై అసభ్య పదజాలంతో నోటికొచ్చినట్లు మాట్లాడిన శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు.