టీచర్ ఉద్యోగాలపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
AP: టీచర్ ఉద్యోగాలపై మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా చూస్తామన్నారు. డీఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపునకు సంబంధించిన ఫైల్ సీఎం వద్ద ఉందని, అక్కడి నుంచి ఫైల్ తమ వద్దకు వచ్చాక ఎంత సడలింపు ఇవ్వాలో నిర్ణయిస్తామన్నారు. అలాగే వైసీపీ హయాంలో టీచర్లపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేస్తామన్నారు.