AP: పింఛన్‌దారులకు ప్రభుత్వం షాకివ్వనుంది. అనర్హులైన 3 లక్షల మంది పింఛన్లను రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అసెంబ్లీలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఈ విషయాన్ని వెల్లడించారు. ‘రాష్ట్రంలో 3 లక్షల మంది అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నారు. 2.5 లక్షల కొత్త పింఛన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పరిశీలిస్తున్నాం. అనర్హులను గుర్తించి తొలగిస్తాం. డిసెంబర్‌లో కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తాం.’ అని సమాధానమిచ్చారు.