నూతన బస్సును ప్రారంభించిన కన్నా
సత్తెనపల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో నూతన బస్సును శుక్రవారం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ బస్సు సత్తెనపల్లి - నరసరావుపేట రూట్లో తిరగనున్నట్లు తెలిపారు. అనంతరం మొదటి టికెట్ కొనుగోలు చేసి కొంత దూరం ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.