స్పెషల్ ఛైర్ వద్దన్న చంద్రబాబు.. వీడియో వైరల్

66చూసినవారు
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభాపక్ష భేటీలో చంద్రబాబు కోసం స్పెషల్ ఛైర్ వేయగా ఆయన దాన్ని మార్పించారు. వేదికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి వేసినటువంటి సాధారణ కుర్చీనే తనకూ వేయాలని సిబ్బందిని కోరారు. వెంటనే సిబ్బంది కుర్చీ మార్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కూటమిలో సమైక్యతను, సమానత్వాన్ని చాటేందుకే బాబు ఇలా చేశారని టీడీపీ వర్గాలంటున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్