అల్లు అర్జున్ ఇంటిపై దాడి (వీడియో)
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అంశం మరింత తీవ్రతరం అవుతోంది. తాజాగా హైదరాబాద్లోని అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నాయకులు దాడి చేశారు. తొక్కిసలాట బాధితులైన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఇంటి గోడలు ఎక్కి రాళ్లు విసిరారు. అనంతరం ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో అల్లు అర్జున్ కుటుంబసభ్యులెవరూ బయట కనిపించలేదు.