హీరో అల్లు అర్జున్‌పై నటి పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా చాలా బాగుందని చెబుతూ.. గంగమ్మ జాతర ఎపిసోడ్‌ని తెలంగాణలోని సమ్మక్క సారలక్క జాతరతో పోల్చుతూ ట్వీట్ చేశారు. ‘మొత్తానికి పుష్ప-2 సినిమా చూశాను. తెలంగాణలో సమ్మక్క సారలక్క జాతర ఎలాగో.. గంగమ్మ జాతరను అక్కడ అంత బాగా చూపించారు. మన ఆచార, సంస్కృతి, సంప్రదాయాలను చాలా బాగా చూపించారీ సినిమాలో. అల్లు అర్జున్ కంటే గొప్పగా ఇంకెవ్వరూ అలా నటించలేరు’ అని రాసుకొచ్చారు.