Nov 16, 2024, 02:11 IST/
కొత్త ఏడాదిలో తెలంగాణ పాలిటిక్స్ మారనున్నాయా?
Nov 16, 2024, 02:11 IST
కొత్త ఏడాదిలో తెలంగాణ పాలిటిక్స్ మరింత రంజుగా మారబోతున్నాయా? ఇన్నాళ్లు సైలెంట్ మోడ్‌లో ఉన్న గులాబీ బాస్ కేసీఆర్ యాక్టివ్ కాబోతున్నారా? అంటే తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఇన్నాళ్లు మౌనం వహించిన కేసీఆర్ ఇక విజృంభించబోతున్నట్లు కేటీఆర్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. నిజానికి కేసీఆర్ మౌనం వెనుక ఏదో వ్యూహం ఉందనే చర్చ చాలాకాలంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇందులో భాగంగానే కొత్త ఏడాదిలో ఆయన యాక్షన్‌లోకి దిగబోతున్నట్టు చర్చ జరుగుతుంది.