
ఏర్పేడు: బాల్య వివాహాలపై అవగాహన
ఏర్పేడు మండలం బండారుపల్లిలో శుక్రవారం బాల్య వివాహాలపై పోలీసు సిబ్బంది అవగాహన కల్పించారు. బాల్య వివాహాల పట్ల జరిగే అనర్థాల గురించి తెలిపారు. బాల్యవివాహాల గురించి ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన బాల్య వివాహాలు జరగడం బాధాకరమన్నారు. బాల్య వివాహాల వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యా యులు, పోలీసులు పాల్గొన్నారు.