
శ్రీకాళహస్తి: పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష
పోక్సో కేసులో ఓ నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల యువకుడు 12 ఏళ్ల బాలికపై 2019లో అత్యాచారం చేశాడు. దీనిపై స్థానిక పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నేరం రుజువుకావడంతో యువకుడికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.2000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శాంతి తీర్పు చెప్పారు.