ఓటీటీలోకి ఉపేంద్ర ‘యుఐ’.. క్లారిటీ
కన్నడ దర్శకుడు, నటుడు ఉపేంద్ర తాజా చిత్రం ‘యుఐ’ డిసెంబర్ 20న విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. కాగా, ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. సన్ నెక్స్ట్ ఓటీటీలో జనవరి రెండో వారంలో ఈ సినిమా విడుదలవుతుందని ప్రచారం జరిగింది. అయితే దీనిపై చిత్ర నిర్మాతల్లో ఒకరైన కేపీ శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు. ‘UI’ చిత్రం OTT హక్కులను సన్ నెక్స్ట్ కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు.