AP: విశాఖ ఏయూ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో ప్రారంభోపన్యాసం చేశారు. 'ఏపీ ప్రజల ప్రేమ మరియు అభిమానానికి నా కృతజ్ఞతలు. మీపై అభిమానాన్ని చూపించే అవకాశం నాకు ఇప్పుడు లభించింది' అని తెలుగులో మాట్లాడారు. అనంతరం సింహాచలం వరాహనరసింహస్వామికి నమస్కారం అంటూ తన స్పీచ్‌ను మోదీ కొనసాగించారు.