త్వరలో ప్రధాని మోదీ అమరావతికి రావాలి: సీఎం చంద్రబాబు

56చూసినవారు
త్వరలో ప్రధాని మోదీ అమరావతికి రావాలి: సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీ త్వరలో ఏపీ రాజధాని అమరావతికి రావాలని సీఎం చంద్రబాబు కోరారు. బుధవారం విశాఖలో చంద్రబాబు మాట్లాడుతూ.. "మోదీని స్ఫూర్తిగా తీసుకొని నిత్యం ముందుకెళ్తాం. త్వరలో అమరావతికి రావాలని ప్రధానిని కోరుతున్నా. నదుల అనుసంధానం మా లక్ష్యం.. అందుకు కేంద్రం సాయం కావాలి. మోదీ కార్యక్రమాల వల్ల దేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. 2047 నాటికి ప్రపంచంలోనే మొదటి లేదా రెండో స్థానంలో ఉంటాం. కేంద్రం సాయంతో మనం నిలదొక్కుకున్నాం.. ముందుకెళ్తున్నాం." అని అన్నారు.

సంబంధిత పోస్ట్