Top 10 viral news 🔥
90 నిమిషాలు ఆగిన గుండెను తిరిగి కొట్టుకునేలా చేసిన వైద్యులు
భువనేశ్వర్ ఎయిమ్స్ వైద్యులు గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండెను తిరిగి కొట్టుకునేలా చేశారు. అనారోగ్యంతో అక్టోబర్ 1న ఎయిమ్స్‌లో చేరిన జవాన్ శుభాకాంత్ సాహు (24) కొద్దిసేపటికే అతడి గుండె పని చేయడం మానేసింది. 40 నిమిషాల పాటు సీపీఆర్ చేసినా ఏ ఫలితం లేదు. దీంతో ఎక్మో ద్వారా ఆక్సిజన్ అందిస్తూ ఎక్స్ట్రాకార్పోరియల్ కార్డియో పల్మనరీ రిససిటేషన్ (ఈసీపీఆర్) చేసి అతడిని బతికించారు. 90 నిమిషాల తర్వాత కొట్టుకుంది.