భువనేశ్వర్ ఎయిమ్స్ వైద్యులు గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండెను తిరిగి కొట్టుకునేలా చేశారు. అనారోగ్యంతో అక్టోబర్ 1న ఎయిమ్స్‌లో చేరిన జవాన్ శుభాకాంత్ సాహు (24) కొద్దిసేపటికే అతడి గుండె పని చేయడం మానేసింది. 40 నిమిషాల పాటు సీపీఆర్ చేసినా ఏ ఫలితం లేదు. దీంతో ఎక్మో ద్వారా ఆక్సిజన్ అందిస్తూ ఎక్స్‌ట్రాకార్పోరియల్ కార్డియో పల్మనరీ రిససిటేషన్ (ఈసీపీఆర్) చేసి అతడిని బతికించారు. 90 నిమిషాల తర్వాత కొట్టుకుంది.