నేడు విచారణకు జానీ మాస్టర్ భార్య!
అత్యాచారం కేసులో అరెస్టైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కస్టడీ విచారణ ఇవాళ రెండో రోజు కొనసాగనుంది. న్యాయవాది సమక్షంలో పోలీసులు ఆయనను విచారించనున్నారు. బాధితురాలు జానీ భార్య అయేషాపైనా ఫిర్యాదు చేయడంతో ఇవాళ ఆమెనూ విచారణకు పిలిచే అవకాశం ఉంది. భార్యాభర్తలిద్దరినీ కలిపి ప్రశ్నిస్తారని సమాచారం. కాగా, జానీ బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది.