తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ పోరాటానికి స్ఫూర్తిగా కోఠి ఉమెన్స్ కాలేజీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాకలి ఐలమ్మ కాలేజీగా నామకరణం చేశారు. ఈనెల 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నారు. కాగా, 1924లో నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ పిలుపుమేరకు, హైదరాబాద్ రాజ్యంలో మహిళలకు విద్యతో సాధికారత కల్పించాలనే లక్ష్యంతో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ కాలేజీని స్థాపించారు.