ఎడ్లపాడు: బోరుబావుల లోని కాపర్ వైరు చోరి
బోయపాలెం-సంగంగోపాలపురం మార్గంలో ముగ్గురు రైతుల పంట పొలాల్లో ఏర్పాటు చేసుకున్న బోరుబావుల లోని కాపర్ వైరు గురువారం రాత్రి చోరి చేశారు. దగ్గు బైరాగి, ఎలినీడి గోవిందరాజులు, షేక్ బాబుకు చెందిన మూడు బావుల్లోని 150 మీటర్ల కాపర్ వైర్ చోరీకి గురైంది. గతంలోనూ రెండు సార్లు ఇదే విధంగా చోరి చేసినట్లు శుక్రవారం బాధితులు చెప్పారు. కొత్త వైరు కొనాలంటే వైరు మీటర్ ధర రూ. 200 వరకు ఉంటుందని తెలిపారు.