ఉయ్యాల ఏడుకొండలు ఇంటిని కూల్చిన గోవిందరాజును అరెస్టు చేయాలి

59చూసినవారు
ఉయ్యాల ఏడుకొండలు ఇంటిని కూల్చిన గోవిందరాజును అరెస్టు చేయాలి
చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామానికి చెందిన ఉయ్యాల ఏడుకొండలు(ఎస్టి) ఇంటిని కూల్చి కులం పేరుతో దూషించి దాడిచేసిన తన్నీరు గోవిందరాజు(వడ్డెర) అతని కుటుంబ సభ్యులను అరెస్టు చేయాలని కుల సంఘాలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం పెదకూరపాడు మండలం లగడపాడు దళితవాడలో కరపత్రాలను ఆవిష్కరించారు. కాగా 18/08/2024న మారణాయుధాలతో ఇంటిపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి ప్రోక్లైన్ తో తమ ఇంటిని కూల్చారని బాధితులు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you