గుంటూరు: డిసెంబర్ 15లోపు అందుబాటులోకి తేవాలి: కలెక్టర్
గుంటూరు నగరంలోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కలెక్టర్ నాగలక్ష్మీ ఆదేశించారు. ప్రాంతీయ గ్రంథాలయాన్ని, పాత గుంటూరులోని ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ని బుధవారం కలెక్టర్ పరిశీలించారు. హాస్టల్ భవనాన్ని డిసెంబర్ 15లోపు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కలెక్టర్ పర్యటనలో పాల్గొన్నారు.