గుంటూరు: సబ్సిడీ రుణాలు కోసం కలెక్టరేట్ వద్ద ధర్నా
ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పోరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలను సత్వరమే విడుదల చేయాలని రాష్ట్రీయ మహాజన సమితి డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లోనే సోమవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా సమితి వ్యవస్థాపకుడు కంభం ఆనంద్ కుమార్ మాట్లాడుతూ. గతంలో తమ నిధులను జగన్మోహన్ రెడ్డి నవరత్నాలకు మళ్ళించారని మండిపడ్డారు.