మాచర్ల: నాగార్జునకొండను సందర్శించిన పర్యాటకులు
ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండను ఆదివారం పలు ప్రాంతాలకు చెందిన పర్యాటకులు సందర్శించారు. ముందుగా నాగార్జునసాగర్ విజయపురిసౌత్లోని లాంచి స్టేషన్ కూ చేరుకొని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆగస్త్య, శాంతిసిరి లాంచీలలో కొండకు చేరుకున్నారు. దాదాపు గంటపాటు కృష్ణా జలాశయంలో పర్యాటకులు లాంచీలో ప్రయాణిస్తూ ఆహ్లాదకర వాతావరణం మధ్య కుటుంబ సమేతంగా నల్లమల అడవులను చూస్తూ కొండకు చేరుకున్నారు.