మాచర్ల: రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు
ప్రభుత్వం రైతుల నుండి నేరుగా రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తుందని దళారులను రైతులు ఆశ్రయించవద్దని సోమవారం వ్యవసాయశాఖ ఎఓ లక్ష్మారెడ్డి వివరించారు. ధాన్యం పండించిన పలు గ్రామాలలో రైతులతో నేరుగా ఆయన సమావేశాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రభుత్వం ధాన్యం క్వింటాలు రూ.2, 320 తో పాటు గోనె సంచులు, రవాణా ఖర్చులు కూడ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.