కోటప్పకొండ రోడ్డులోని రజకుల స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని అమరావతి రజక ఐక్యవేదిక నాయకులు మంగళవారం నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. నాయకులు వెంకటస్వామి మాట్లాడుతూ.. తమకు 1945లో దాతలు సత్రం నిర్మాణానికి అనుమతినిచ్చి రిజిస్ట్రేషన్ చేశామన్నారు. దాతలు మృతి చెందడంతో స్థలం ఆక్రమణకు గురైందని అన్నారు. రజకులకు ఉపయోగపడే సత్రానికి న్యాయం చేయాలని డీఎస్పీని కోరారు.