నరసరావుపేట: ప్రభుత్వం క్రిస్మస్ కానుకలను ఇవ్వాలి
ప్రభుత్వం తక్షణమే క్రిస్మస్ కానుకులను అందజేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. హామీ ఇచ్చిన మేరకు ప్రభుత్వం ప్రతి ఇంటికి కానుకలు అందించాలన్నారు. మంగళవారం క్రిస్మస్ వేడుకలను నిర్వహించి, కేక్ కట్ చేసి మిఠాయిలను పంచిపెట్టారు. క్రీస్తు అందించిన ప్రేమను, స్నేహాన్ని ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలన్నారు.