అమెరికాలో తెనాలి యువతి దుర్మరణం

54చూసినవారు
అమెరికాలో  తెనాలి యువతి దుర్మరణం
అమెరికాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి మృతి చెందింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పరిమళ (26) ఎంఎస్ చేయడానికి 2022లో అమెరికా వెళ్లి టెన్సెసీ రాష్ట్రంలో ఉంటుంది. అయితే స్నేహితులతో కలసి వెళుతుండగా రాక్ వుడ్ఎవెన్యూ సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. యువతి మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు తానా ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you