వైసీపీకి షాక్.. బీజేపీలోకి ఎంపీటీసీ
ఓబులవారి పల్లి మండలం గాదెల హరిజనవాడకు చెందిన మండల ప్రాదేశిక సభ్యురాలు కొత్తూరు ఈశ్వరమ్మ వైసీపీని వీడి బిజెపి కండువా కప్పుకున్నారు. మంగళవారం బిజెపి మండల అధ్యక్షుడు చినిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనయుడు గోవర్ధన్ రెడ్డి ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపిటిసి ఈశ్వరమ్మ మాట్లాడుతూ ప్రధానమంత్రి పాలన నచ్చి బిజెపిలో చేరినట్లు ఆమె తెలిపారు.