కన్వర్షన్ లేని స్థలాల రిజిస్ట్రేషన్ నిలిపివేతపై రియాల్టర్ల వినతి పత్రం

582చూసినవారు
కన్వర్షన్ లేని స్థలాల రిజిస్ట్రేషన్ నిలిపివేతపై రియాల్టర్ల వినతి పత్రం
రాజంపేట డివిజన్ పరిధిలోని రియల్ ఎస్టేట్ కి సంబంధించి రాజంపేట ఆర్డిఓ కన్వర్షన్ లేని స్థలాలకు ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు ఆపివేయమని సబ్ రిజిస్టర్ల వారికి నోటీసులు ఇచ్చారని, రాజంపేట డివిజన్ పరిధిలోని అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీస్ లలో రిజిస్ట్రేషన్లు ఆపివేసి ఉన్నారని, దీనివలన గత 30 సంవత్సరాలుగా నేడు ఇతరులకు విక్రయించి రిజిస్ట్రేషన్ కొరకు వెళితే రిజిస్ట్రేషన్ ఆపివేయబడ్డాయని, రిజిస్టర్ ఆఫీసర్లు చెప్పడంతో తమ అవసరాల కొరకు అనగా కూతురి పెళ్లి కోసం, చదువుల కోసం, వైద్యం కోసం స్థలాలు అమ్ముకుని ఉన్నారని రియల్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్టర్ అయితే కానీ డబ్బులు ఇవ్వమని కొన్నవారు అనడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులకు వినతి పత్రం అందజేసి వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 200 మంది పైగా హాజరయ్యారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే కలెక్టర్ తో మాట్లాడారు. కలెక్టర్ అతి త్వరలో దీనిపై పరిశీలించి రిజిస్టర్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్