
నగిరిపాడు: రేపటి నుండి శ్రీశ్రీశ్రీ రంగనాయకుల స్వామి బ్రహ్మోత్సవాలు
చిట్వెల్ మండలం నగిరిపాడు గ్రామ పంచాయతీ నందు వెలసిన శ్రీశ్రీశ్రీ రంగనాయకుల స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం నుండి 27వ తేదీ వరకు 10 రోజుల పాటు అంగరంగ వైభవముగా జరుగును. ఈ 10 రోజులు ఉదయం, సాయంకాలం స్వామి వారికి ప్రత్యేక పూజలు జరుగును. ప్రతి రోజూ వచ్చిన భక్తులందరికీ మధ్యాహ్నం, రాత్రికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి జయప్రదం చేయవలసిందిగా ఆలయ ప్రధానార్చకులు కోరారు.