
మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతి మండలంలో రైస్ మిల్లులు ఏర్పాటు
TG: రేవంత్ సర్కార్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి మండలంలో మహిళలతో రైస్ మిల్లులు, మినీ గోదాముల ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మహిళా రైస్ మిల్లుల్లో మిల్లింగ్ చేయిస్తామన్నారు. ఈ బియ్యాన్నిఎఫ్సీఐకి సరఫరా చేయిస్తామని తెలిపారు. మండల మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీకి అద్దెకు 600 బస్సులు ఇస్తామని చెప్పారు.