అనకాపల్లిలో హత్య కేసు.. ట్రాన్స్‌జెండర్ల ఆందోళన (వీడియో)

64చూసినవారు
AP: అనకాపల్లి జిల్లాలో దీప అనే ట్రాన్స్‌జెండర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. నిన్న తల ఒక చోట.. మొండెం, కాళ్లు, చేతులు మరో చోట లభించాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. వై జంక్షన్ వద్ద ఇతర శరీర భాగాలను గుర్తించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. బుధవారం అనకాపల్లి ఎన్టీఆర్ ఏరియా ఆస్పత్రి ఆవరణలో ట్రాన్స్‌జెండర్లు ఆందోళన చేశారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్