ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Jan 02, 2025, 14:01 IST/

నాకు జీవితంలో నిలబడే ధైర్యాన్నిచ్చింది పుస్తకాలే: డిప్యూటీ సీఎం (వీడియో)

Jan 02, 2025, 14:01 IST
తనకు జీవితంలో నిలబడే ధైర్యాన్నిచ్చింది పుస్తకాలేనని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ పేర్కొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన 35వ పుస్తక మహోత్సవాన్ని ఆయన ప్రారంభించారు."మా తల్లిదండ్రుల వల్ల పుస్తక పఠనం అలవాటైంది. రూ.కోటి ఇవ్వడానికి ఆలోచించను గానీ.. పుస్తకం ఇచ్చేందుకు మాత్రం ఆలోచిస్తా. నా వద్ద ఉన్న పుస్తకాలు మాత్రం ఎవ్వరికీ ఇవ్వను. పుస్తక పఠనం లేకపోతే జీవితంలో ఏమయ్యేవాడినో అనిపిస్తుంది. నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు." అని పవన్‌ అన్నారు.