Top 10 viral news 🔥
విద్యార్థులపై దాడి చేసిన తోటి విద్యార్థులు
TG: హాస్టల్లోని విద్యార్థులపై తోటి విద్యార్థులు దాడి చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పటాన్‌చెరువులోని ఓ ప్రభుత్వ బాలుర వసతిగృహంలో నిద్రిస్తున్న తొమ్మిదో తరగతి విద్యార్థులపై కొందరు విద్యార్థులు దాడిచేశారు. ఈ ఘటనలో గాయపడ్డవారిని హాస్టల్ సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి దిగిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని పటాన్చెరువు పీఎస్‌లో విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.