కాట్రేనికోన: రెండవ రోజు కొనసాగుతున్న నిరసన
కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో ఓఎన్జీసీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా రెండో రోజు గురువారం గ్రామస్థులు ఆందోళనకు సిద్దమయ్యారు. సెక్షన్ 30 అమలులో ఉన్నందున ఆందోళనలు జరపడానికి వీలు లేదని పోలీసులు హెచ్చరించి, ఆందోళనకారులు వేసిన టెంట్ ను తొలగించారు. దీంతో శాంతియుతంగా రహదారి చెంతనే గ్రామస్థులు నిరశన తెలుపుతున్నారు. ఓఎన్జీసీ కార్యకలాపాల వలన నష్టపోయిన తమను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు.