కాట్రేనికోన: విద్యార్థులతో ముచ్చటించిన ఎమ్మెల్యే దాట్ల
పల్లె పండుగ పంచాయితీ వారోత్సవాల్లో కాట్రేనికోన మండలం, గెద్దనపల్లి పంచాయతీ పరిధి చింతలమెరకలో సీసీ రోడ్డు నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పిల్లలతో కలిసి ముచ్చటించారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకోవాలని విద్యార్థులకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.