'శకుని' మూవీ దర్శకుడు కన్నుమూత
కార్తీ నటించిన 'శకుని' సినిమా దర్శకుడు శంకర్ దయాళ్(54) గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన 'కుతానిదహల్ మున్నేట్రక్ కజగం' అనే కొత్త చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రం పనులపై వెళ్తుండగా స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే కొలత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు తెలిపారు. ఆయన మృతిపై తమిళ చిత్ర పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది.