వాట్సాప్ గ్రూప్ సలహాలతో ఇంట్లోనే భార్యకు డెలివరీ చేసిన భర్త
వాట్సాప్ గ్రూప్ సలహాలతో ఇంట్లోనే భార్యకు డెలివరీ చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. కుండ్రత్తూరు సమీపంలో మనోహరన్(36), అతని భార్య సుకన్య(32) నివాసం ఉంటున్నారు. గర్భవతి అయిన సుకన్యకు ఈ నెల 17న పురిటి నొప్పులు రాగా, ఆస్పత్రికి తీసుకెళ్లకుండా.. ఓ వాట్సప్ గ్రూప్ సభ్యుల సలహాల మేరకు ఇంట్లోనే భార్యకు పురుడు పోశాడు. ఇది కాస్తా పోలీసులకు చేరడంతో.. మనోహరన్పై కేసు నమోదు చేశారు. పిచ్చి పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు హెచ్చరించారు.