రూ.988.76 కోట్లు అకౌంట్లలో జమ
ఏపీ ప్రభుత్వం పంచాయతీలకు మరోసారి తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం 4 నెలల వ్యవధిలో రూ.1,987.38 కోట్ల ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆగస్టులో రూ.998.62 కోట్లు విడుదల చేయగా.. తాజాగా మరో రూ.988.76 కోట్లు పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌ల బ్యాంకు అకౌంట్లలో జమ చేసింది.