నేడు ఆర్జీవీని విచారించనున్న ప్రకాశం పోలీసులు

70చూసినవారు
నేడు ఆర్జీవీని విచారించనున్న ప్రకాశం పోలీసులు
సంచలన దర్శకుడు ఆర్జీవీని సోమవారం ప్రకాశం జిల్లా పోలీసులు విచారించనున్నారు. వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా పవన్, చంద్రబాబుపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. వారం కిందటే విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇవ్వగా.. తనకు సమయం కావాలని ఆర్జీవీ చెెప్పారు. గడువు ముగియడంతో ఇవాళ ఒంగోలు పీఎస్‌లో విచారించనున్నారు.