దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చుక్కెదురు
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. పోలీసుల అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని రామ్ గోపాల్ వర్మ వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అరెస్ట్‌పై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని న్యాయస్థానం సూచించింది. అభ్యర్థన పోలీసుల ముందు చేసుకోవాలని, కోర్టు ముందు కాదని న్యాయస్థానం వెల్లడించింది. కాగా, పోలీసుల విచారణకు మరికొంత సమయమిచ్చేలా ఆదేశించాలని హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ అభ్యర్థించారు.